కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీగా లోఖండే ప్రశాంత్ సీతారాం.. అధికారిక ఉత్తర్వులు విడుదల

by Kema Shiva Kumar |

కేంద్ర ప్రభుత్వంలో కీలక ఐఏఎస్ బదిలీ జరిగింది.

కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీగా లోఖండే ప్రశాంత్ సీతారాం.. అధికారిక ఉత్తర్వులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో కీలక నియామకం జరిగింది. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చైర్‌పర్సన్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారాంకు కీలక బాధ్యతలను కట్టబెట్టారు. ఆయనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని హోం డిపార్ట్‌మెంట్‌లో అదనపు కార్యదర్శిగా (Additional Secretary) నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి ఇవాళ ఢిల్లీలోని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది.

Next Story