ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026.. దరఖాస్తుల ఆహ్వానం

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా సంచాలకులు తమీమ్ అన్సారియా తెలిపారు....

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026.. దరఖాస్తుల ఆహ్వానం
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2026కు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యా సంచాలకులు తమీమ్ అన్సారియా తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికను మూడు విధానాల ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సెల్ఫ్ నామినేషన్, ఐదుగురు సహచర ఉపాధ్యాయుల సిఫార్సు, అలాగే లీప్ యాప్‌లో పనితీరు ఆధారంగా ఎంపిక చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలు మినహా మిగిలిన అన్ని యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. అభ్యర్థులు కనీసం పదేళ్ల సేవ పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేశారు. అర్హులైన ఉపాధ్యాయులు జూలై 1 నుంచి జూలై 15 వరకు తమ సంబంధిత డివిజన్ ఉప విద్యాశాఖాధికారుల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ మేరకు ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లకు మార్గదర్శకాలు, కార్యాచరణ షెడ్యూల్‌ను పంపినట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.

Next Story