- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > Telugu News > తిమ్మాయిపల్లి తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
తిమ్మాయిపల్లి తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
by Ratna Kumari |
అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండా గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

X
దిశ, అడ్డాకుల : అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండా గ్రామంలో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తండాలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎమ్మెల్యే నిధులతో ఏర్పాటు చేసిన నాలుగు తాగునీటి బోర్లను ప్రారంభించారు. అనంతరం రూ.10 లక్షల వ్యయంతో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు తండావాసులు, మహిళలు మంగళహారతులు, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తన కుటుంబం తరఫున నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story






