- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హెల్త్ స్కీంను వెంటనే అమల్లోకి తేవాలి: ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన హెల్త్ స్కీంను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. ...

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన హెల్త్ స్కీంను వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజును సచివాలయంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన హెల్త్ స్కీం ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల వేతనం నుండి మినహాయింపులు జరుగుతున్నప్పటికీ హెల్త్ కార్డులు మంజూరు చేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దీనివల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగ విరమణ చెందిన సీపీఎస్ ఉద్యోగుల మూలవేతనంపై నిర్ణయం తీసుకోవాలని, భార్యాభర్తలు ఇద్దరి వద్ద మినహాయించిన మొత్తాన్ని వెంటనే ఒకరికి తిరిగి చెల్లింపు జరపాలని కోరారు. హెల్త్ స్కీంలో అన్ని యాజమాన్యాల, గురుకుల ఉపాధ్యాయులతో పాటు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులను కూడా చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ ట్రస్ట్‌కు సంబంధించిన కమిటీ సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేసి, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చించి వెంటనే స్కీంను అమలుపరచాలన్నారు.
అంతేకాకుండా, ప్రైవేటు యాజమాన్యాలలోని ఉద్యోగ, అధ్యాపకులకు కూడా ఈ స్కీంను వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. సిఎస్ ను కలిసిన వారిలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి, పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్, సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.






