- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆల్మాస్‌పూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు
ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్‌పూర్ కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండలం ఆల్మాస్‌పూర్ కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామంలో అర్ధరాత్రి నుంచి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినా విద్యుత్ శాఖ సిబ్బంది స్పందించలేదని గ్రామస్తులు ఆరోపించారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఈ రాకేష్ రెడ్డి వివరణ..
ఈ ఘటనపై విద్యుత్ శాఖ ఏఈ రాకేష్ రెడ్డి వివరణ ఇస్తూ, ఆల్మాస్‌పూర్ గ్రామపంచాయతీ సిబ్బంది తమ శాఖకు సమాచారం ఇవ్వకుండా వీధి దీపాల మరమ్మతుల కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆపరేట్ చేశారని తెలిపారు. పనులు పూర్తయిన అనంతరం స్విచ్‌ను సరిగా మూసివేయకపోవడంతో బుధవారం రాత్రి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పునరుద్ధరించగానే సరిగా కనెక్షన్ కాకపోయిన భాగంలో మంటలు చెలరేగినట్లు వివరించారు. ఘటన అనంతరం సమస్యను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు.






