- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యం..
by Batti.Sumithra |
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన గొల్ల మల్లేష్ (55) అదృశ్యమైన ఘటన పై గౌరారం పోలీసులు మిస్సింగ్ కేసునమోదు చేశారు.

X
దిశ, వర్గల్ : సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన గొల్ల మల్లేష్ (55) అదృశ్యమైన ఘటన పై గౌరారం పోలీసులు మిస్సింగ్ కేసునమోదు చేశారు. గౌరారం ఏఎస్ఐ పోచగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం సమయంలో ఇంట్లో కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ అనంతరం మల్లేష్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన కుమారుడు మధు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ తెలిపారు.
Next Story






