- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రెస్‌మీట్ మధ్యలో కేసీఆర్‌కు కాల్ చేసిన అద్దంకి దయాకర్
బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష్యంగా ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష్యంగా ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ చర్చలకు రావాలని కోరేందుకు తాను స్వయంగా కేసీఆర్‌కు ఫోన్ చేశానని, అయితే ఆయన తన ఫోన్ కాల్‌కు స్పందించలేదని దయాకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం చర్చల కోసం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని కోరుతున్నారని, కానీ ప్రతిపక్షనేతగా ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీశ్ రావులపై అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవితలు కేవలం సైడ్ యాక్టర్లు మాత్రమే. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం కొడుకు, అల్లుడు పోటీ పడుతున్నారు. వీళ్లు మాకు లెక్కే కాదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని అద్దంకి దయాకర్ మండిపడ్డారు.
‘బీజేపీతో బేరసారాలను పెంచుకోవడం కోసమే కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ఆస్కార్ అవార్డు ఇచ్చినా తక్కువే. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం చేతగాకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదినట్లు కేసీఆర్ రాజకీయాలున్నాయి. 70 సీట్లు మీకు 30 మాకు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు బీజేపీని బతిమాలుకుంటున్నారు. కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు కాకపోతే ఆయన ఊసు కూడా ఎత్తే వాళ్లం కాదు. తెలంగాణ చరిత్రలో హీనుడుగా మిగిలిపోకుండా కేసీఆర్ బయటకు రావాలి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ప్రజలు ఇచ్చిన స్థాయి’ అని అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.






