ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే..

by Taduka Kalyani |

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలపై ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు.

ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే..
X

దిశ, కొండమల్లేపల్లి, జూలై 2: ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలపై ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని కొండమల్లేపల్లిలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), బూత్ కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తల కోసం నిర్వహించిన ఓటర్ల సవరణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతి బీఎల్‌ఏ పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా 18 ఏళ్లు పూర్తిచేసుకున్న యువత పేర్లు నమోదు చేయడంతో పాటు, పొరపాట్లతో తొలగించిన లేదా తప్పులు ఉన్న ఓట్లను వెంటనే సవరించాలని కోరారు. అనంతరం సవరణ కార్యక్రమానికి సంబంధించిన కొత్త నమోదు, మార్పులు, తొలగింపులు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలపై బీఎల్‌ఏలు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సమగ్ర అవగాహన కల్పించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. దేవరకొండ నియోజకవర్గంలోని ప్రతి బూత్‌లో యూత్ కాంగ్రెస్ నాయకులు, చదువుకున్న యువత, పార్టీ కార్యకర్తలు చురుకుగా పాల్గొని ప్రతి ఓటును కాపాడడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ నాయిని జమున మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దూదిపాల వేణుధర్ రెడ్డి, సీనియర్ నాయకుడు దూదిపాల శ్రీధర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర్ల వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు ఊట్కూరి వేమన్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, కోలుముంతల్ పహాడ్ సర్పంచ్ రవి నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకుడు ఏకుల సురేష్, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, బీఎల్‌ఏలు, బూత్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story