- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > దేశం-విదేశం > Breaking: శివకాశిలోని బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 15 మంది చిక్కుకున్నట్లు అనుమానం!
Breaking: శివకాశిలోని బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 15 మంది చిక్కుకున్నట్లు అనుమానం!
by Ramesh Naini |
తమిళనాడులోని శివకాశి సమీపంలో గల కోప్పైనాయకన్‌పట్టి వద్ద ఉన్న ‘గురులక్ష్మి’ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడులోని శివకాశి సమీపంలో గల కోప్పైనాయకన్‌పట్టి వద్ద ఉన్న ‘గురులక్ష్మి’ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో దాదాపు 15 మంది కార్మికులు కర్మాగారం లోపల చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
కర్మాగారంలో నిల్వ ఉంచిన బాణసంచా ఇంకా పేలుతూనే ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ, లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






