సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల

by Vemula.Srinu Prasad |

రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ ) నోటిఫికేషన్ విడుదల చేసింది....

సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ.. నోటిఫికేషన్ విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఖాళీగా ఉన్న సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గురువారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ ) నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ రిక్రూట్‌మెంట్ కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించి జులై 7 నుండి ఆగస్టు 12 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది. ఐసీఏఆర్ గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్శిటీ నుండి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ బీఎస్సీ అగ్రికల్చర్ తో పాటు, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమీ, ప్లాంట్ ఫిజియాలజీ సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ అగ్రీకల్చర్ (పీజీ) పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొంది.

జులై 1, 2026 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు నిండాలి. గరిష్టంగా 44 ఏళ్లు మించకూడదని స్పష్టం చేసింది. ఈ పోస్టులకు పేస్కేల్ 51 వేల నుండి లక్షా 27 వేల వరకు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్, పరీక్షా విధానం, సిలబస్, ఇతర వివరాల కోసం అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ను సంప్రదించాలని సూచించింది.

Next Story