జాయింట్ యాక్షన్ టీమ్‌ల సమన్వయమే కీలకం

by Ratna Kumari |   (  Updated:2026-07-02 16:14:21  IST  )

వర్షాకాలంలో సంభవించే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు.

జాయింట్ యాక్షన్ టీమ్‌ల సమన్వయమే కీలకం
X

దిశ, మేడ్చల్ బ్యూరో : వర్షాకాలంలో సంభవించే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల సన్నద్ధత, విపత్తు నిర్వహణపై బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో నిర్వహించిన జాయింట్ యాక్షన్ టీమ్‌ల (జేఏటీలు) ఓరియెంటేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలో నాలాల పూడికతీత, ముంపు ప్రాంతాల గుర్తింపు, అత్యవసర యంత్రాంగం ఏర్పాటు వంటి ముందస్తు చర్యలను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు.

నీటిమునిగే ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. టీజీఐసీసీసీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న జాయింట్ యాక్షన్ టీమ్‌లు విపత్తుల సమయంలో వేగవంతమైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రధాన లక్ష్యంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ జి. సృజన, ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్, ఐఎండీ శాస్త్రవేత్త జి.ఎన్.ఆర్. శ్రీనివాస్ రావు, హైడ్రా అదనపు కమిషనర్ వి. పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story