- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరు : బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్
అధికారంలోకి వస్తే ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్‌రెడ్డి ఆచరణలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అధికారంలోకి వస్తే ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్‌రెడ్డి ఆచరణలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఎవరి పాలనలో ఏం చేశామో చర్చిద్దామని తొడలు కొట్టిన మంత్రులు తోకముడిచారని మండిపడ్డారు. అరెస్టులు, నిర్బంధాలు ఉద్యమ పార్టీకి కొత్తకాదని.. వాటితో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని.. సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని హెచ్చరించారు. చర్చించే దమ్ములేక కేటీఆర్, హరీశ్రావును అక్రమంగా నిర్బంధించారని నిప్పులు చెరిగారు. సవాళ్లు విసరడం, పారిపోవడం సీఎం రేవంత్‌రెడ్డి, వారి మంత్రులకు మొదటి నుంచీ అలవాటేనని పేర్కొన్నారు. ధైర్యముంటే బీఆర్ఎస్ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే గురుకుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఒప్పుకున్నట్లేనని స్పష్టం చేశారు. సర్కారు బెదిరింపులకు బీఆర్ఎస్ నాయకులెరూ భయపడరని తేల్చిచెప్పారు.






