క్రైస్తవ మైనారిటీలకు ఆర్థిక సహాయ పథకం

by Muthe.Rajitha |

మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని 'తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్' 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుంచి ఆర్థిక సహాయ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

క్రైస్తవ మైనారిటీలకు ఆర్థిక సహాయ పథకం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలోని 'తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్' 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుంచి ఆర్థిక సహాయ పథకం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పి.సబిత ఒక ప్రకటన విడుదల చేశారు. కుట్టు మిషన్లు, చిన్న వ్యాపారాల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ-బైక్, ఈ-స్కూటీ, మోటార్ బైక్ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారి వార్షిక కుటుంబ ఆదాయం రూ.1,50,000 లోపు ఉండాలని ఎండీ పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఈనెల 18వ తేదీ వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 040-23391067 ఫోన్ నెంబర్ ద్వారా లేదా tscmfc.in వెబ్‌సైట్‌ను సందర్శించి సంప్రదించవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.

Next Story