రీహాబ్‌ సెంటర్‌లో యువకుడి ఆత్మహత్య

by Batti.Sumithra |

ఆటోనగర్‌లోని ఓ డీ-అడిక్షన్ (రీహాబిలిటేషన్) సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

రీహాబ్‌ సెంటర్‌లో యువకుడి ఆత్మహత్య
X

దిశ, వనస్థలిపురం : ఆటోనగర్‌లోని ఓ డీ-అడిక్షన్ (రీహాబిలిటేషన్) సెంటర్‌లో చికిత్స పొందుతున్న యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం సరూర్‌నగర్ లింగోజిగూడకు చెందిన కె.మణిదీప్ (28), జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తూ తాగుడుకు బానిస కావడంతో కుటుంబ సభ్యులు జూన్ 29న ఆటోనగర్‌లోని వేద రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించారు.

బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో మణిదీప్ వాష్‌రూమ్‌కు వెళ్లి, వెంట తెచ్చుకున్న బ్యాగ్ స్ట్రిప్‌ను వాష్‌రూమ్ వెంటిలేటర్ గ్రిల్‌కు కట్టి ఉరివేసుకున్నట్లు రీహాబిలిటేషన్ సెంటర్ నిర్వాహకుడు కొండల్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే వారు ప్రాగ్మా ఆస్పత్రికి చేరుకోగా, అప్పటికే మణిదీప్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మద్యానికి బాని సై ఇక్కడ అది అందక డిప్రెషన్‌తోనే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి బావమరిది అనిల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story