దేవిశ్రీ 'ఎల్లమ్మ' సినిమా స్టోరీ లీక్‌?

by velandi.Saikiran |

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్న ఎల్లమ్మ సినిమా స్టోరీ లైన్ వైరల్ గా మారింది.

దేవిశ్రీ ఎల్లమ్మ సినిమా స్టోరీ లీక్‌?
X

దిశ‌, వెబ్ డెస్క్: బలగం సినిమాతో ద‌ర్శ‌కుడిగా బంపర్ హిట్ అందుకున్న వేణు ఎల్దండి.. సరికొత్త ప్రాజెక్టుతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే ఎల్లమ్మ. ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పైన కూర్చున్నారు వేణు. దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఈ మూవీలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హీరోయిన్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సాయి పల్లవి, కీర్తి సురేష్, ఇలా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేస్తున్న ఎల్లమ్మ సినిమా స్టోరీ లైన్ వైరల్ గా మారింది.

ఎల్లమ్మను కొలిచే చిందు యక్షగానం కళాకారుల ఫ్యామిలీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని లిరికిస్ట్ కాసర్ల శ్యాం ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. కుటుంబం, కలలు, గ్రామానికి సంబంధించిన ఎమోషన్స్, తల్లి సెంటిమెంట్, హీరో-హీరోయిన్ లవ్ అన్ని మిళితం కానున్నట్లు ఆయన వివరించారు. ఎల్లమ్మకు, కళాకారులకు ఉన్న సంబంధం ఏంటి అనేది కూడా ఈ సినిమాలో స్పష్టంగా చూపించబోతున్నట్లు వెల్లడించారు. దీంతో ఎల్లమ్మ సినిమా స్టోరీ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ సినిమాలో కూడా తెలంగాణ యాస భాష ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story