- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
11 ఏళ్ల కుర్రాడు ర్యాష్ డ్రైవింగ్..ఎనిమిది మంది సన్యాసులు మృతి
ఒక పికప్ ట్రక్ ఢీకొని ఏకంగా 8 మంది బౌద్ధ సన్యాసులు అక్కడికక్కడే మృతి చెందారు.

దిశ, వెబ్ డెస్క్: థాయిలాండ్ లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఒక పికప్ ట్రక్ ఢీకొని ఏకంగా 8 మంది బౌద్ధ సన్యాసులు అక్కడికక్కడే మృతి చెందారు. 11 ఏళ్ల కుర్రాడికి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన థాయిలాండ్ లోని ముక్దాహన్ ఫ్రావిన్స్ లో జరిగింది. ఇది థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు దాదాపు 600 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు 40 మంది బౌద్ధ సన్యాసుల బృందం ఒక క్షేత్రానికి కాలినడకన ఉబాన్ రత్చతాని ప్రావిన్స్ కు యాత్ర చేపట్టింది. ఇందులో భాగంగానే సన్యాసులు రోడ్డుపై, కాలినడకన వెళ్తున్నారు.
ఈ క్రమంలోనే అతివేగంగా ఎదురుగా వచ్చిన ఓ పికప్ ట్రక్, సన్యాసులను ఢీకొట్టింది. దీంతో స్పాట్ లోనే 8 మంది సన్యాసులు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన తెలియగానే రంగంలోకి దిగిన పోలీసులు, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ ప్రమాదానికి కారణం 11 ఏళ్ల బాలుడని విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఆ కుర్రాడు ఉన్నాడు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ వచ్చిన తర్వాత బాలుడిని వారికి అప్పగిస్తామని తెలిపారు పోలీసులు. వారే అతడిని విచారించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






