వైభవ్ ఆడింటే, ప్యాంట్లు ఊడగొట్టేవాడు: రవిశాస్త్రి

by velandi.Saikiran |

వైభ‌వ్ అరంగేట్రంపై భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా స్పందించారు.

వైభవ్ ఆడింటే, ప్యాంట్లు ఊడగొట్టేవాడు: రవిశాస్త్రి
X

దిశ‌, వెబ్ డెస్క్: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. వైభవ్ అరంగేట్రం పైన తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఇంకెప్పుడు వైభవ్ ను తుది జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తూనే ఉన్నారు. మాజీ క్రికెటర్లు సైతం, సంజు లేదా తిలక్ స్థానంలో వైభవ్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కోచ్ రవి శాస్త్రి కూడా ఈ అంశంపై స్పందించారు. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ సందర్భంగా వైభవ్ ను ఆడించకపోవడంపై ఆయన మండిపడ్డారు.

ఐర్లాండ్ లో వైభవ్ ను ఆడించాల్సిందని తెలిపారు. అక్కడ చిన్న గ్రౌండ్స్ ఉండేవని.. ఈ నేపథ్యంలో స్టేడియం బ‌య‌ట‌కు వైభవ్ సిక్సర్లు కొట్టేవాడని ప్రశంసించారు. ఐర్లాండ్ బౌలర్ల ప్యాంట్లు విప్పి చేతిలో పెట్టేవాడని వైభవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంగ్లాండ్ తో జరుగుతున్న సిరీస్ సందర్భంగా వీలైతే అతడిని తుది జ‌ట్టులోకి తీసుకోవాలని కోరారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండబోదని పేర్కొన్నారు.

Next Story