- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేసింగ్ కార్లలోనూ ఇథనాల్
రేసింగ్ కార్లలోనూ ఇథనాల్ వాడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.

దిశ, వెబ్ డెస్క్: రేసింగ్ కార్లపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. రేసింగ్ కార్లలోనూ ఇథనాల్ ను వాడుతున్నారని, ఈ బయో ఫ్యూయల్ వాటి స్పీడ్ ను భారీగా పెంచుతుందని వెల్లడించారు. అవసరమైనన్ని టెస్టులు నిర్వహించిన తర్వాత ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.
ఇథనాల్ వల్ల మైలేజ్ తగ్గుతుందని... కానీ దానికి చాలా కారణాలు ఉన్నాయని తెలిపారు హర్దీప్ సింగ్ పురీ. మార్కెట్ లో E-వెహికల్స్, బయో ఫ్యూయల్ మిక్స్డ్ వెహికల్స్ లాంటి వాటికి కూడా స్పేస్ ఉందని వివరించారు. రాబోయే రెండు నుంచి మూడు నెలల పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు ఇలాగే తక్కువ స్థాయిలో స్థిరంగా కొనసాగితేనే... ప్రభుత్వ రంగ సంస్థల ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుంది అన్నారు. తద్వారా ప్రజలకు రిటైల్ ధరలలో ఉపశమనం లభిస్తుందని తెలిపారు.






