T20 World Cup 2026: ఫైన‌ల్స్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్

by velandi.Saikiran |   (  Updated:2026-07-02 21:45:54  IST  )

ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్స్ లోకి ఇంగ్లాండ్ దూసుకెళ్లింది.

T20 World Cup 2026: ఫైన‌ల్స్ కు దూసుకెళ్లిన ఇంగ్లాండ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్స్ లో అడుగు పెట్టింది ఇంగ్లాండ్. గురువారం దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య రెండో సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్... దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐదు వికెట్ల నష్టానికి 169 పరుగులు సాధించింది.

అయితే ఛేదనలో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. ఈ క్రమంలో 129 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా, ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఫైనల్స్ లో ఇంగ్లాండ్ అడుగుపెట్టింది. ఈనెల 5వ తేదీన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్స్ ఉండనుంది. కాగా టీ20 వరల్డ్ కప్ లో అత్యధిక సార్లు ఫైనల్ కు చేరిన రెండో జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. అటు రెండో సెమీ ఫైనల్ లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఇంటి దారి పట్టింది.

Next Story