కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు.. తీస్తున్న కొద్దీ పూడిక‌

by velandi.Saikiran |   (  Updated:2026-07-02 22:31:01  IST  )

చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలు వ‌ల్లో ఉంది అనేట్టు ప‌రిస్థితి మారిందనని హైడ్రా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేబుల్ వైర్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు.. తీస్తున్న కొద్దీ పూడిక‌
X

దిశ, శేరిలింగంపల్లి : చెత్తంతా ఎక్క‌డ ఉంది అంటే మురుగు, వ‌ర‌ద కాలు వ‌ల్లో ఉంది అనేట్టు ప‌రిస్థితి మారిందనని హైడ్రా అధికారులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. తాజాగా కాలువల్లో పేరుకుపోయిన పూడిక చూసి ఆ శాఖ అధికారులే ఆశ్చర్యపోతున్నారు. సివి క్ సెన్స్ పైన చర్చ జరగాలని కోరుకుంటున్నారు. ఏ కాలువ‌ను క‌దిలించినా లారీల కొద్దీ చెత్త బ‌య‌ట‌కు ప‌డుతోంది. కేబుల్ వైర్లు, చెత్త క‌వ‌ర్లు, ప‌రుపులు, దిండులు, దుప్ప‌ట్లు, సోఫాలు, కుర్చీలు.. ఇలా ఇంట్లో ప‌నికి రాని వ‌ స్తువంతా మురుగు కాలువ‌ల్లోకి చేరు తోంది. వ‌ర‌ద సాఫీగా వెళ్ల‌డానికి వీలు గా నిర్మించిన బాక్స్ డ్రైన్లు చెత్త‌తో, ప్లా స్టిక్ వ్య‌ర్థాల‌తో నిండిపోతున్నాయి. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ వ‌ర్షపు నీరు కా ల‌నీల‌ను, ర‌హ‌దారుల‌ను ముంచెత్తుతోంది. నాలాల్లో మురుగు కాలువ‌ల్లో చెత్త ప‌డ‌కుండా ఎవ‌రికి వారు జాగ్ర‌ త్త‌లు తీసుకోవాల్సిన‌ అవ‌స‌రాన్ని ఇక్క‌ డ వ‌ర‌ద కాలువ‌ల్లో తొల‌గిస్తున్న చెత్త చెబుతోంది. వ‌ర్షం ప‌డేట‌ప్పుడు వ‌ర‌ద నీరు ముంచెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న హైడ్రా.. వ‌ర్షం లేన‌ప్పుడు ముంపునకు గ‌ల కార‌ణాల‌పై హైడ్రా దృష్టి పెట్టింది.

మియాపూర్ నుంచి పటాన్ చెరు వరకు..

మియాపూర్ నుంచి ప‌టాన్‌చెరు వెళ్తు న్న మార్గంలో ఎడ‌మ‌వైపు ఉన్న బాక్సు డ్రైన్‌లో కేబుల్ వైర్లు తెట్టు బ‌య‌ట‌ప‌ డింది. అక్క‌డ వ‌ర‌ద ఏమాత్రం పోని ప‌రిస్థితి ఉంది. కేబుల్ వైర్ల‌తో కూడిన చెత్త కాలువ‌ల్లో క‌నిపించింది. జేసీబీల‌తో బ‌య‌ట‌కు గుంజితే సెటిల్ అయిన కేబుల్ వైర్ల‌తో కూడిన చెత్త బ‌య‌ట ప‌డింది. 5 సెంటీమీట‌ర్లు వ ర్షపాతం కంటే ఎక్కువ నమోదైతే చం దాన‌గ‌ర్‌, లింగంప‌ల్లి ఆర్‌యూబీ ర‌ హ‌దారి వ‌ర‌దతో నిండిపోతుంది. న‌క్క వాగుకు సాఫీగా సాగాల్సిన వ‌ర‌ద రోడ్లపైకి చేరడానికి పూడికతో నిండిపోవడమే కారణం. రూ. కోట్లు ఖ‌ర్చు చేసి ఎస్‌ఎన్ డీపీ ప్రాజెక్టు కింద బాక్సు డ్రైన్ నిర్మించారు. అక్క‌డ భూమి కాస్త స‌మాంత‌రంగా ఉండ‌డంతో చెత్తంతా ఆర్‌యూబీ కింద ఉన్న కాలువ‌లో పేరుకుపోయి వ‌ర‌ద వెళ్ల‌ని ప‌రిస్థితిని హైడ్రా అధికారులు గుర్తించారు. ఇటీ వ‌ల ఇనుప గ్రిల్స్‌ను తీసి చెత్త‌ను హై డ్రా క్లియ‌ర్ చేసింది. రెండు ట్ర‌క్కుల ప్లాస్టిక్ వ్య‌ర్థాలు ఒకే ద‌గ్గ‌ర వ‌చ్చాయి.

కాలువల్లో పూడికతీతకు కోట్లు వెచ్చిస్తున్నా..

మియాపూర్, శేరిలింగంపల్లి, మా దాపూర్ సర్కిల్ కార్యాలయాల పరిధిలో ఉన్న వివిధ కాలనీల్లోని కాలువల్లో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని తొలగించేందుకు ప్రతి ఏ టా ఒక్కో సర్కిల్ కు సుమారు కోటి రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇందు కోసం ఏజెన్సీలను నియమించారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు, మట్టితో కూడుకుపోయే కాలువలు శుభ్రం చేసి మురికి నీరు సాఫీగా పోయే ఏర్పా ట్లు చేయాల్సిన బాధ్యత ఈ కాం ట్రా క్టర్లకు అప్పగించారు. కాలనీవాసు లు చేసే ఫిర్యాదులు, ఇంజినీరింగ్ అధికారులు గుర్తించిన పూడికలు తొ లగించే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లకు అప్పగించారు. వ్యర్థాల తొలగించే కాలువ దూరాన్ని బట్టి, వ్యర్ధాల బరువును బట్టి ఇంజనీరింగ్ అధికారులు బిల్లులు చెల్లిస్తారు. కాలువల నుంచి సేకరించిన చెత్త డంపింగ్ యార్డ్‌కు తరలించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా కోట్ల రూపాయలు నిధులు వినియోగిస్తున్నట్లు లెక్కల్లో చెబుతున్న వాస్తవ పరిస్థితులు అందుకు విరు ద్ధంగా ఉన్నాయి. తాజాగా హైడ్రా చేపట్టి న కాలువల క్లియరెన్స్ లో తొలగిస్తున్న వ్యర్ధలే నిదర్శనం. మాదాపూర్ హైటె క్స్ వెళ్లే దారిలో, రాయదుర్గం మల్కం చెరువు వద్ద, మియాపూర్, చందానగర్ లో జాతీయ రహదారికి అనుకొని ఉన్న డ్రైన్ బాక్సులు పూడికతో నిం డిపోయి రోడ్లపైకి వర్షం నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఎగువన ఉన్న మంజీర రోడ్డు కాలనీల నుంచి మదీనాగూడ ఈర్ల చెరువు వరకు డ్రైన్ బాక్సులు నిర్మించేందుకు రెండేళ్ల క్రి తం రూ 7.41 కోట్లు నిధులు మం జూరు చేశారు. డ్రైన్ బాక్స్ నిర్మాణం పను లు మధ్యలోనే వదిలిపెట్టారు. చె రువు కు అనుసంధానం చేయలేదు. రోడ్లు, కాలనీలు ముంపుకు గురవుతున్న చెరువుల్లో మాత్రం చుక్క నీరు చేరడం లేదు.

Next Story