- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్మీ ఆఫీసర్‌నంటూ ఏఐ ఫొటోలతో యువతికి వల
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసిన యువకుడిని గురువారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వనస్థలిపురం : పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసిన యువకుడిని గురువారం నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మక్బూల్ జానీ వివరాల ప్రకారం శామీర్‌పేట్‌కు చెందిన ముకేరా గోవర్ధన్ (29) సోషల్ మీడియా ద్వారా నాగోల్ పరిధిలోని ఆనంద్‌నగర్‌కు చెందిన యువతితో పరిచయం పెంచుకున్నాడు. తాను ఆర్మీ ఆఫీసర్‌నంటూ నకిలీ ఏఐ ఫొటోలను ఉపయోగించి దగ్గరై ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని సహజీవనం చేశాడు. ఇదే అదునుగా తన తండ్రి అనారోగ్యంగా ఉన్నాడని చెప్పి బాధితురాలి నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నాడు. మోసాన్ని పసిగట్టిన యువతి ప్రశ్నించడంతో.. ముఖం చాటేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. నిందితుడికి ఇప్పటికే పెళ్లైనట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. గత ఏడాది అల్వాల్‌కు చెందిన మరో మహిళను కూడా ఇదే తరహాలో మోసం చేసిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లి, బెయిల్ పై బయటకు వచ్చి ఈ మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ తెలిపారు.






