- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో మనస్తాపం.. గడ్డి మందు తాగి రైతు మృతి
మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, గుర్రంపోడు: మండలంలోని పిట్టలగూడెం గ్రామంలో అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ రైతు గడ్డి మందు తాగి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పగిడిమర్రి ఎల్లయ్య (66) గత పదేళ్లుగా బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నాడు. షుగర్ నియంత్రణ కోసం ప్రతిరోజూ రెండుసార్లు ఇన్సులిన్ ఇంజక్షన్లు తీసుకుంటూ చికిత్స పొందుతున్నాడు. ఇటీవల ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో మనస్తాపానికి గురైన ఎల్లయ్య జూలై 1న ఉదయం తన ఇంటి సమీపంలో గడ్డి మందు తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మృతుడి కుమారుడు పగిడిమర్రి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.






