- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగపల్లి.. గుంగల్ మధ్య ఘోర ప్రమాదం : యువకుడి దుర్మరణం
మంచాల మండల పరిధిలోని ఆగపల్లి–గుంగల్ గ్రామాల మధ్య ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.

దిశ, మంచాల : మంచాల మండల పరిధిలోని ఆగపల్లి–గుంగల్ గ్రామాల మధ్య ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండమల్లపల్లి గ్రామానికి చెందిన రమావత్ దామోదర్ (23) ఇబ్రహీంపట్నంలో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి తన గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగపల్లి–గుంగల్ గ్రామాల మధ్యకు రాగానే ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మధు తెలిపారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో దామోదర్ ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న సీఐ మధు తన సిబ్బందితో కలిసి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను గమనించిన ఆయన స్వయంగా చొరవ తీసుకుని మృతదేహాన్ని వాహనంలోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు దర్యాప్తును వేగవంతం చేసినట్లు సీఐ తెలిపారు.






