- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వనస్థలిపురం పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
వనస్థలిపురం పీఎస్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు.

దిశ, వనస్థలిపురం : వనస్థలిపురం పీఎస్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి చనిపోయాడు. సీఐ రవిబాబు వివరాల ప్రకారం ఉదయం 5.15 నుంచి 5.30 గంటల మధ్య మల్లికార్జున్‌నగర్ కాలనీ కమాన్ సమీపంలో, హర్ష టయోటా ఎదురుగా డివైడర్ పక్కన సుమారు 40 –45 ఏళ్ల వయస్సు గల వ్యక్తి నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన గుర్తుతెలియని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మార్నింగ్ వాక్‌కు వచ్చిన ఓ వ్యక్తి డయల్–100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అంబులెన్స్ ద్వారా మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటన పై కేసునమోదు చేసిన పోలీసులు మృతుడి ఆచూకీ తెలిసిన వారు వనస్థలిపురం పోలీస్స్టేషన్లో లేదా 8712662280, 8712662300 నంబర్లకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.






