ఉత్తమ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా కిరణ్ కుమార్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

by Ratna Kumari |

అక్రమ ఔషధాల విక్రయాలు, నాసిరకం మందుల నియంత్రణలో విశేష సేవలు అందించిన హనుమకొండ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జన్ను కిరణ్ కుమార్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఔషధ నియంత్రణ శాఖ అధికారిగా పురస్కారం లభించింది.

ఉత్తమ డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా కిరణ్ కుమార్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : అక్రమ ఔషధాల విక్రయాలు, నాసిరకం మందుల నియంత్రణలో విశేష సేవలు అందించిన హనుమకొండ జిల్లా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ జన్ను కిరణ్ కుమార్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఔషధ నియంత్రణ శాఖ అధికారిగా పురస్కారం లభించింది. గత రెండేళ్లుగా హనుమకొండ ఔషధ నియంత్రణ శాఖలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్‌ను గురువారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ అవినాష్ మహంతి ప్రశంసాపత్రం, నగదు బహుమతితో సత్కరించారు. జిల్లాలో ప్రజారోగ్య పరిరక్షణ, అక్రమ ఔషధాల నియంత్రణ, నాణ్యతలేని మందుల విక్రయాలపై చర్యలు, మెడికల్ షాపుల్లో నిబంధనల అమలు, ఔషధ నియంత్రణ వ్యవస్థను సమర్థవంతంగా పర్యవేక్షించడంలో చూపిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో ఔషధాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రజారోగ్య పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తున్న కిరణ్ కుమార్ సేవలను తెలంగాణ రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అభినందించింది.

Next Story