- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసిఫాబాద్ ఆసుపత్రుల పై కలెక్టర్ ఫోకస్.. కీలక ఆదేశాలు జారీ !
జిల్లాలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు.

దిశ, ఆసిఫాబాద్ : జిల్లాలోని ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని జిల్లా కలెక్టర్ హరిత ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలు, చిన్నారులు, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చికిత్స, మందులు, పరీక్షలు సమయానికి అందేలా చూడాలని సూచించారు. ఆసుపత్రుల్లో అవసరమైన పరికరాలు, మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను తరలించేందుకు అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ, వైద్య విద్యా బోధన, మెరుగైన వసతుల కల్పన పై కూడా చర్చించారు.






