- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెంగళూరు, చెన్నైల కంటే హైదరాబాద్‌లోనే నిరుద్యోగం అధికం.. NSO నివేదికలో సంచలన విషయాలు
దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నైలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ తాజా నివేదిక వెల్లడించింది. 46 మిలియన్-ప్లస్ జనాభా గల నగరాలపై జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) జూన్ 30, 2026న విడుదల చేసిన నివేదికలో సంచలన వివరాలు వెల్లడయ్యాయి. 2025 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ఆధారంగా ఈ గణాంకాలను రూపొందించారు.
నివేదికలోని ముఖ్యాంశాలు ఇవే..
హైదరాబాద్‌లో నిరుద్యోగ రేటు 6.8 శాతంగా నమోదు కాగా.. బెంగళూరు (2.8%), చెన్నై (4.4%) మెరుగైన స్థితిలో ఉన్నాయి. దక్షిణాదిలో అత్యధికంగా మధురైలో 11.6%, ఏపీలోని విజయవాడలో 6.9%, విశాఖపట్నంలో 6% నిరుద్యోగం ఉంది. కాగా, దేశవ్యాప్తంగా పాట్నా (20.9%) అగ్రస్థానంలో ఉంది. 46 నగరాల జాతీయ సగటు నిరుద్యోగ రేటు 4.9 శాతంగా ఉంది. సగటు పని గంటల విషయంలో హైదరాబాద్ (వారానికి 49 గంటలు) బెంగళూరు, చెన్నైల కంటే ముందుంది. విజయవాడలో ఇది ఏకంగా 50.1 గంటలుగా ఉంది.
నెలవారీ ఆదాయం.. మహిళల భాగస్వామ్యం
హైదరాబాద్‌లో సగటు నెలవారీ వేతనం రూ. 31,153. ఇది జాతీయ సగటు (రూ. 28,808) కంటే ఎక్కువే అయినప్పటికీ.. బెంగళూరు (రూ. 34,323), ముంబై (రూ. 36,267), ఢిల్లీల కంటే తక్కువగా ఉంది. సర్వే చేసిన 46 నగరాల్లో పురుషుల శ్రామిక శక్తి భాగస్వామ్యం 75.9% ఉండగా, మహిళల భాగస్వామ్యం కేవలం 27.2% గానే ఉంది. చదువు కోసం పురుషులు (53.5%) ఉపాధికి దూరంగా ఉంటుంటే.. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ బాధ్యతల వల్లే అత్యధిక శాతం మహిళలు (68.7%) శ్రామిక శక్తికి దూరమవుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.






