Arrest: ఆదాయానికి మించి ఆస్తులు.. DSP భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ACB అధికారులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-07-02 14:53:37  IST  )

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సీఐడీ డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

Arrest: ఆదాయానికి మించి ఆస్తులు.. DSP భీమ్‌రెడ్డిని అరెస్ట్ చేసిన ACB అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో డీఎస్పీ భీమ్‌రెడ్డి (Bheem Reddy)ని ఏసీబీ (ACB) అధికారులు అరెస్ట్ చేవారు. ఇవాళ హైదరాబాద్‌‌లోని ఆయన నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తన వ్యక్తిగత డైరీలో 15 మంది బినామీల పేర్లను భీంరెడ్డి రాసినట్లుగా కూడా గుర్తించారు. ఉదయం నుంచి జరిపిన తనిఖీల్లో సుమారు 16 చోట్ల రూ.200 కోట్ల ఆస్తులు భీమ్‌‌రెడ్డికి ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలలో వెండి, రూ.40 లక్షల లిక్విడ్ క్యాష్ గుర్తించి వాటిని సీజ్ చేశారు. ప్రస్తుతం భీమ్‌రెడ్డి బినామీ ఇళ్లలో సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

కాగా, డీఎస్పీ భీంరెడ్డి 1995లో ఎస్సైగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యారు. చాలాకాలం పాటు ఆయన హైదరాబాద్‌ నగరంలోనే విధులు నిర్వహించారు. ఆ తరవాత సీఐగా ప్రమోషన్ పొంది రాయదుర్గం, వనస్థలిపురం, చిక్కడపల్లి తదితర పోలీస్ స్టేషన్‌లలో విధులు నిర్వర్తించారు. డీఎస్పీగా ప్రమోషన్ అందుకున్న తరవాత పటాన్‌చెరు డివిజన్‌లో పనిచేశారు. ప్రస్తుతం సీఐడీలో డీఎస్పీగా పనిచేస్తున్నారు.

Next Story