అద్భుతమైన ప్రగతి వైపు రాజమండ్రి ఎయిర్‌పోర్టు: రాత్రి సమయంలోనూ ల్యాండింగ్

by Vemula.Srinu Prasad |

గత రెండేళ్లలో రాజమండ్రి ఎయిర్ పోర్టు అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. .

అద్భుతమైన ప్రగతి వైపు రాజమండ్రి ఎయిర్‌పోర్టు: రాత్రి సమయంలోనూ ల్యాండింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గత రెండేళ్లలో రాజమండ్రి ఎయిర్ పోర్టు అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ రాజమండ్రి ఎయిర్ పోర్టు దేశవ్యాప్తంగా తన కనెక్టివిటీని గణనీయంగా పెంచుకుందన్నారు. దేశంలోని ప్రముఖ నగరాలతో రాజమండ్రి ఎయిర్ పోర్టును అనుసంధానం చేయడంతో కీలక అడుగులు పడ్డాయని పురంధేశ్వరి తెలిపారు. రాజమండ్రి నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆమె చెప్పారు. తిరుపతికి కూడా సర్వీసులు ప్రారంభంకావడంతో పర్యాటకం, వ్యాపార రంగాలకు ఎంతో మేలు చేకూరుతోందని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు.

రాత్రి సమయంలోనూ ల్యాండింగ్


రాత్రి సమయాల్లోనూ రాజమండ్రి ఎయిర్ పోర్టులో విమానాలు ల్యాండింగ్ అయ్యేలా అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేశారని ఎంపీ పురంధేశ్వరి స్పష్టం చేశారు. అత్యాధునిక హంగులతో నూతన టెర్మినల్ భవన నిర్మాణ పనులు చేపట్టామని, ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయని ఆమె తెలిపారు. అహ్మదాబాద్, వారణాసి వంటి ప్రముఖ నగరాలకు కూడా కొత్త విమాన సర్వీసులను తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. దేశంలోని ప్రధాన నగరాలతో రాజమండ్రి ఎయిర్ పోర్టుని జోడించడం వల్ల ఈ ప్రాంతం సైతం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు.

Next Story