6న ఇందిరాపార్కు వద్ద ధర్నా.. వామపక్షపార్టీల పిలుపు

by Vemula.Srinu Prasad |

ప్రతి గుడిసెకు పట్టా-ప్రతి పేదవానికి ఇల్లు’నినాదంతో వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించాయి...

6న ఇందిరాపార్కు వద్ద ధర్నా.. వామపక్షపార్టీల పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘ప్రతి గుడిసెకు పట్టా-ప్రతి పేదవానికి ఇల్లు’నినాదంతో వామపక్షాలు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధం కావాలని నిర్ణయించాయి. ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చేవరకు దీర్ఘకాలికంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే విద్యానగర్ లోని సీపీఐ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యాలయం(మార్క్స్ భవన్)లో వామపక్షపార్టీల నేతలు గురువారం సమావేశమయ్యారు.

‘ ప్రతి గుడిసెకు పట్టా - పేదవాడికి ఇల్లు’ అనే నినాదంతో ఈ నెల 6న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలని లెఫ్ట్ పార్టీల నేతలు నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతంలోని లక్షలాది ఎకరాల్లో సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని కూడా ఈ ధర్నాలో డిమాండ్ చేయాలని నిర్ణయించారు.

న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు సాదినేని వెంకటేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, నాయకులు పశ్య పద్మ,ఈ టి.నర్సింహ, సీపీఎం కార్యదర్శి జాన్ వెస్లీ, నాయకులు అబ్బాస్, సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులుకె. గోవర్దన్, మాస్ లైన్ రాష్ట్ర నాయకులు ఎం. హన్మేశ్, ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, ఎస్యూసీఐ నాయకులు భరత్ పాల్గొన్నారు

Next Story