ఫైనల్లీ.. జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

by Chukka Sudharani |

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది.

ఫైనల్లీ.. జైలర్ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న టైమ్ వచ్చేసింది. రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జైలర్ 2. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. జైలర్ 2 చిత్రం అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ‘సన్ పిక్చర్స్’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తూ.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్నట్లు తెలిపారు. కాగా.. 2023 వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. యాక్షన్, ఎమోషన్స్ అండ్ ఎంటర్‌టైన్మెంట్‌తో వచ్చి రజినీకాంత్‌కు మంచి కమ్ బ్యాక్ హిట్‌ను ఇవ్వగా.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తోన్న జైలర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Next Story