- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Disinvestment: ప్రభుత్వంలో మళ్లీ డిస్ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ షురూ
ప్రస్తుతం ధరలు కొంత తగ్గినా, ఇంధన మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉండటంతో ముందస్తుగా అదనపు ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న వ్యూహంతో కేంద్రం ఈ చర్యలకు సిద్ధమవుతోంది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరోసారి వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో ఎల్ఐసీలో ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీఓ) ద్వారా సుమారు రూ.10,000 కోట్లు, హిందుస్థాన్ జింక్‌లో మరో వాటా విక్రయం ద్వారా దాదాపు రూ.5,000 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం ధరలు కొంత తగ్గినా, ఇంధన మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉండటంతో ముందస్తుగా అదనపు ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలన్న వ్యూహంతో కేంద్రం ఈ చర్యలకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో పెట్టుబడిదారుల ఆసక్తి, షేర్ ధరలు, విక్రయాల సమయంపై ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లతో అధికారులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు, గతంలో ఆశించిన స్పందన రాక నిలిచిపోయిన ఐడీబీఐ బ్యాంకులో మెజారిటీ వాటా విక్రయాన్ని కూడా ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకురావాలని భావిస్తోంది. ఈసారి రిజర్వ్ ధరను తగ్గించే అవకాశంతో పాటు, గత బిడ్డింగ్‌లో పాల్గొన్న సంస్థలకే కొత్త బిడ్లు పరిమితం చేసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే, విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో భారత మార్కెట్ నుంచి సుమారు 29 బిలియన్ డాలర్లు(రూ. 2.76 లక్షల కోట్ల) ఉపసంహరించుకోవడం, త్వరలో రానున్న జియో ప్లాట్‌ఫామ్స్, ఎన్‌ఎస్‌ఈ వంటి భారీ ఐపీఓలు పెట్టుబడిదారుల నిధుల కోసం పోటీని పెంచనున్నాయి. అయినప్పటికీ కోల్ ఇండియా, ఎన్‌హెచ్‌పీసీ వాటాల విక్రయాలకు లభించిన మంచి స్పందనతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.






