- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : ఫిఫా వరల్డ్ కప్-2026లో బెల్జియం జట్టు ప్రీక్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్-32లో సెనెగల్‌పై విజయం సాధించి టోర్నీలో ముందంజ వేసింది. గురువారం ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు జరిగింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో చివరికి బెల్జియం 3-2తో నెగ్గింది. యౌరీ టీలెమన్స్ రెండు అద్భుతమైన గోల్స్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఆరంభం నుంచి ఇరు జట్లు పోటాపోటీగా గోల్ కోసం ప్రయత్నించాయి. అయితే, మొదట్లో ఆధిపత్యం మాత్రం సెనెగల్‌దే. 24వ నిమిషంలోనే హిబిబ్ డియార్ గోల్ చేసి ఆ జట్టు ఖాతా తెరిచాడు. రెండో గోల్ కూడా ఆ టీమ్ కొట్టింది. 51వ నిమిషంలో ఇస్మాయిల్ సర్ర్ చేసిన గోల్‌తో సెనెగల్ 2-0తో ఆధిక్యంలో నిలిచి పట్టు బిగించింది. ఆ జట్టు చాలా సేపు బెల్జియంను నిలువరించి ఆధిక్యాన్ని కాపాడుకుంది. దీంతో సెనెగల్ విజయం ఖాయమే అనిపించింది. మ్యాచ్ ముగియడానికి కూడా ఎంతో సేపు లేదు.
ఈ పరిస్థితుల్లో బెల్జియం ప్లేయర్లు అద్భుతంగా పుంజుకున్నారు. 86వ నిమిషంలో రొమేలు లుకాకు గోల్ చేసి తమ జట్టులో ఆశలు నింపాడు. 89వ నిమిషంలో యౌరి టీలియన్స్ చేసిన గోల్‌తో బెల్జియం స్కోరును 2-2తో సమం చేసింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలవడంతో గేము అదనపు టైంకు వెళ్లింది. అక్కడ బెల్జియం ప్లేయర్ యౌరి టీలెమన్స్ మరోసారి అదరగొట్టాడు. 125వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచి బెల్జియంను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపు కోసం తమ శక్తి మేరకు ప్రయత్నించాయి. బెల్జియం 21 సార్లు, సెనెగల్ 19సార్లు గోల్ కోసం ట్రై చేశాయి. గత వరల్డ్ కప్‌లో బెల్జియం గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టింది.
24 ఏళ్ల తర్వాత నాకౌట్‌లో అమెరికా విక్టరీ
ఆతిథ్య జట్టు అమెరికా కూడా టోర్నీలో ముందంజ వేసింది. బోస్నియాతో జరిగిన రౌండ్-32 మ్యాచ్‌లో అమెరికా 2-0తో గెలుపొందింది. దీంతో యూఎస్‌ఏ 24 ఏళ్ల తర్వాత నాకౌట్ మ్యాచ్‌లో నెగ్గడం గమనార్మం. తాజా మ్యాచ్‌లో ఇరు జట్లు దూకుడుగా ఆడాయి. చక్కటి డిఫెన్స్ ప్రదర్శించాయి. కానీ, ఫస్టాఫ్ ముగియడానికి కాసేపటి ముందు 45వ నిమిషంలో ఫోలరిన్ బాలోగన్ గోల్ చేయడంతో అమెరికా ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక, 82వ నిమిషంలో మాలిక్ టిల్‌మన్ చేసిన గోల్‌తో యూఎస్‌ఏ 2-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. బోస్నియా ఒక్క గోల్ కూడా చేయలేదు. అమెరికాతో పోలిస్తే బోస్నియానే ఎక్కువగా గోల్ కోసం ప్రయత్నించింది. 11 సార్లు ట్రై చేయగా.. 4 సార్లు గోల్ పోస్టు వద్దకు వెళ్లింది. కానీ, ఆ జట్టును అమెరికా నిలువరించింది.






