BIG Alert: ఈ ప్రాంతానికి భారీ వర్ష సూచన

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-02 12:21:44  IST  )

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మేరకు ఉత్తర కోస్తా ఏపీ నుంచి ఒడిశా వరకు అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ...

BIG Alert: ఈ ప్రాంతానికి భారీ వర్ష సూచన
X

దిశ, వెబ్ డెస్క్: వాయవ్య బంగాళాఖాతం(Bangalakhatam)లో అల్పపీడనం(LowPressure) ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఇది ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ మేరకు ఉత్తర కోస్తా ఏపీ(Ap) నుంచి ఒడిశా(Odisa) వరకు అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రెండు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, గురువారం, శుక్రవారం విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఉత్తర కోస్తాలోని ప్రభావిత జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు పాత కట్టడాలు, చెట్ల కింద ఉండొద్దని అధికారులు స్పష్టం చేశారు.

అల్లకల్లోలంగా సముద్రం

అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని, తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మరో 48 గంటల్లో మరింత తీవ్రం కావచ్చని అంచనా వేశారు. దీంతో కలెక్టర్లు, విపత్తు నిర్వహణ బృందాలు అలర్ట్ అయ్యాయి. ముందస్తు చర్యలో భాగంగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Next Story