- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కలకలం రేగింది. అమ్మమ్మతో కలిసి ఊరు వెళ్లేందుకు స్టేషన్‌కు వచ్చిన నిఖిల్ అనే మూడేళ్లు బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. బాలుడిని అతడి అమ్మమ్మ కొంగుకు కట్టుకుని నిద్రించగా అర్ధరాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిపోయాడు.

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. బాలుడిని కిడ్నాప్ చేసిన నిందితుడిని జీడిమెట్లలోని ఓ హోటల్ లో పోలీసులు పట్టుకున్నారు. బాలుడిని తల్లికి అప్పగించి నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా పన్నెండు రోజుల క్రితం నిఖిల్ అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి ఊరు వెళ్లేందుకు స్టేషన్‌కు వెళ్లగా బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. బాలుడిని అతడి అమ్మమ్మ కొంగుకు కట్టుకుని నిద్రించగా అర్ధరాత్రివేళ గుర్తుతెలియని వ్యక్తి ఎత్తుకెళ్లిపోయాడు. దొంగకు సంబంధించిన వీడియో సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాబుని ఎత్తుకెళ్లే ముందు నిందితుడు ఓ ఓయో రూమ్ లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కానీ ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా ఆ ఓయో రూమ్ తీసుకున్నట్టు తేలింది. దీంతో పన్నెండు రోజులుగా శ్రమించి బాలుడి ఆచూకీ కనుకున్నారు. బాలుడిని అప్పగించడంతో తల్లి ఊపిరిపీల్చుకుంది.






