ప్రశ్న రావణ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి

by Ajay Maddhiboyina |

యూట్యూబ‌ర్ ప్ర‌శ్ర రావ‌ణ్‌ను మంగళవారం రాత్రి ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రశ్న రావణ్‌ను తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపై కోడిగుడ్లతో దాడి
X

దిశ‌, వెబ్ వెబ్: యూట్యూబ‌ర్ ప్ర‌శ్ర రావ‌ణ్‌ను మంగళవారం రాత్రి ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు రావణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో రావణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధ‌వారం ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రుప‌ర్చ‌గా మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. ఇంతలోనే 2025లో ప‌వ‌న్ క‌ల్యాణ్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశాడ‌ని న‌మోదైన‌ మ‌రో కేసులో స‌ర్ప‌వ‌రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌న్ని స‌ర్ప‌వ‌రం పోలీస్ స్టేష‌న్ కు త‌ర‌లించ‌గా నేడు టెస్టుల కోసం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన కార్య‌ర్త‌లు అడ్డుకుని రావ‌ణ్ ను త‌ర‌లిస్తున్న జీపుపై కోడిగుడ్ల‌తో దాడి చేశారు. దీంతో కాసేపు అక్క‌డ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. పోలీసులు అదుపు చేసే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ కార్య‌క‌ర్త‌లు జీపును కొంత‌దూరం వ‌ర‌కు వెంబ‌డించారు. వెంట‌నే పోలీసులు ఎక్కువ‌మంది అక్క‌డ‌కు చేరుకుని ప‌రిస్థితిని అదుపులోకి తీసుకువ‌చ్చారు.

Next Story