- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Health: మూడ్ స్వింగ్స్ వేధిస్తున్నాయా? ఈ లోపాలు ఉన్నాయేమో చూసుకోండి!
మానసిక ఆరోగ్య కేవలం బాహ్య కారణాలను బట్టి మాత్రమే ఉండదు. శరీరంలో పోషకాల లోపాలు కూడా ప్రభావితం చేస్తాయి.

దిశ, ఫీచర్స్ : తరచుగా మూడ్ స్వింగ్స్ వేధిస్తున్నాయా? మనసు బాగోలేదని ఫీలవుతున్నారా? అయితే మీలో కొన్ని ముఖ్యమైన పోషకాల లోపం కూడా ఉండవచ్చు. ఎందుకంటే.. మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. మెదడు సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి. ఒకవేళ అవి లోపిస్తే మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇంతకీ ఏమిటా పోషకాలు? ఎందులో లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మానసిక ఆరోగ్యమనేది కేవలం బాహ్య కారణాలను బట్టే ఉండదని, కొన్ని ముఖ్యమైన మైక్రోన్యూట్రియెంట్స్ (సూక్ష్మ పోషకాలు) లోపాలు కూడా అందుకు కారణం అవుతాయని ఇటీవల పరిశోధనలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం లోపాలు ఇందుకు కారణం అవుతాయి. వీటిని సహజ సిద్ధమైన పద్ధతిలో ఆహారం ద్వారా తీసుకోవడం ద్వారా సమస్య నుంచి బటయపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
1. విటమిన్ డి : దీనిని సన్‌షైన్ విటమిన్ అని కూడా అంటారు. శరీరంలో ఇది తక్కువగా ఉంటే డిప్రెషన్ రిస్క్ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇది మెదడు సమర్థవంతంగా పనిచేసేందుకు, మానసిక స్థితితో సంబంధం ఉన్న రసాయనాల నియంత్రణకు సహాయపడుతుంది.
2. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ : ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి సరిగ్గా అందకపోతే మానసిక సమస్యలు తలెత్తే చాన్స్ ఎక్కువ. సాల్మన్, సార్డీన్స్ వంటి చేపల్లో, వాల్‌నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వంటి ఆహారాల్లో ఎక్కువగా ఇవి ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవాలి. నరాల కణాల మెమ్బ్రేన్‌లను ఆరోగ్యంగా ఉంచి, మెదడులో వాపును తగ్గించి, సెరటోనిన్, డోపమైనన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్ల ఉత్పత్తికి తోడ్పడతాయి ఈ పోషకాలు సహాయపడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
3. మెగ్నీషియం : నరాల సాధారణ పనితీరుకు అత్యంత అవసరమైన మరో పోషకం మెగ్నీషియం. ఇది ఒత్తిడిని నియంత్రిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపరుస్తుంది. NMDA రిసెప్టర్లను సమతుల్యం చేయడం ద్వారా మూడ్ స్థిరత్వానికి సహాయపడుతుంది. ఈ మూడు పోషకాలు కూడా న్యూరో ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం, మెదడు కణాల ఆరోగ్యం మెరుగుపరచడం వంటి వివిధ మార్గాల్లో పని చేస్తాయి. అయితే ఈ పోషకాలు మాత్రమే డిప్రెషన్‌కు పూర్తి నివారణ కాదు. జీవనశైలి మార్పులు, థెరపీ, మందులు లేదా ఇతర చికిత్సలు కూడా అవసరం కావచ్చు అంటున్నారు నిపుణులు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిపుణుల ప్రత్యక్ష సలహాలకు ప్రత్యామ్నాయం కాదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.






