- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షుగర్ పేషెంట్స్ రక్తదానం చేయొచ్చా?
అనారోగ్యంగా ఉంటే బ్లడ్ డొనేషన్‌కు అనుమతించరు కదా మరి డయాబెటిస్ ఉన్న వారు రక్తదానం చేయొచ్చా? అంటే.. చేయొచ్చు కానీ కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఆ కండిషన్స్ ఏంటి?

దిశ, ఫీచర్స్ : అనారోగ్యంగా ఉంటే బ్లడ్ డొనేషన్‌కు అనుమతించరు కదా మరి డయాబెటిస్ ఉన్న వారు రక్తదానం చేయొచ్చా? అంటే.. చేయొచ్చు కానీ కొన్ని షరతులు వర్తిస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఆ కండిషన్స్ ఏంటి? ఎప్పుడు అనుమతిస్తారు తెలుసుకుందాం.
ఎవరు చేయకూడదు?
*భారతీయ ఆస్పత్రి మార్గదర్శకాల ప్రకారం ఇన్సులిన్ వినియోగించేవారు బ్లడ్ డొనేషన్ చేసేందుకు అనుమతించరు. అనియంత్రిత బ్లడ్ షుగర్, యాక్టివ్ ఇన్ఫెక్షన్లు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆరోగ్యం స్థిరపడే వరకు వేచి ఉండాలి. ఏవైనా మందులు వాడుతున్నా లేదా ఇటీవల ఏమైనా ఆరోగ్య మార్పులు ఉన్నా.. డొనేషన్ సెంటర్‌లో స్క్రీనింగ్ చేసే డాక్టర్‌కు తప్పక చెప్పాలి.
* రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా లేనప్పుడు.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాడుతున్నప్పుడు డయాబెటిక్స్‌కు బ్లడ్ డొనేషన్‌కు అనుమతి ఉండదు. డయాబెటిస్ బాగా నియంత్రణలో ఉంటే .. డైట్, వ్యాయామం, మందుల ద్వారా మేనేజ్ చేస్తుంటే.. బ్లడ్ డొనేషన్ చేయొచ్చు అని నిపుణులు చెప్తున్నారు.
సూచనలు:
* రక్తదానం చేసే ముందు సమతుల్య భోజనం చేసి.. బాగా నీళ్లు తాగాలి.
* బ్లడ్ డొనేషన్‌కు ముందు, తర్వాత రక్తంలో చక్కెర స్థాయిని చెక్ చేసుకోవాలి. ఇది మైకం, అలసట వంటివి రాకుండా ఉండటానికి సాయపడుతుంది.
* రక్తదానం తర్వాత ఏమైనా అసౌకర్యం అనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలి.
* ప్రతి రక్తదానం కేంద్రం తన సొంత ఎలిజిబిలిటీ క్రైటేరియాను అనుసరిస్తుంది. కాబట్టి దానం చేయడానికి ముందు మీ డాక్టర్‌ను లేదా బ్లడ్ డొనేషన్ సెంటర్‌ను సంప్రదించండి.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడినది. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వైద్యుడిని సంప్రదించండి.






