- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కష్టకాలంలో చేతులెత్తేసిన కంపెనీ.. నెటిజన్లను సహాయం కోరుతూ దర్శన రాజేంద్రన్ ఎమోషనల్ పోస్ట్
వరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చూస్తుంటే, దయచేసి ఈ కంపెనీని మాత్రం ఎంచుకోవద్దని ఆమె నెటిజన్లను కోరారు.

దిశ, సినిమా: ప్రముఖ నటి దర్శన రాజేంద్రన్ తన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘హృదయం’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఆమె ఇటీవల ‘పరదా’ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ను సదరు కంపెనీ తిరస్కరించడంపై దర్శన తీవ్రంగా మండిపడ్డారు. ప్రస్తుతం తాను అనారోగ్యంతో బాధపడుతూ ఎంతో క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్నానని, ఇలాంటి టైమ్‌లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రవర్తన తనను మానసికంగా మరింత కుంగదీసిందని దర్శన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ కోసం చూస్తుంటే, దయచేసి ఈ కంపెనీని మాత్రం ఎంచుకోవద్దని ఆమె నెటిజన్లను కోరారు. అలాగే ఈ ఇన్సూరెన్స్ సమస్యను పరిష్కరించడంలో ఎవరైనా సహాయం చేయగలరా అని ఆమె తన ఫాలోవర్లను అడిగారు. దర్శన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమెకు మద్దతుగా అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. కష్టకాలంలో అండగా ఉంటుందనుకున్న ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా చేతులు ఎత్తేయడం దారుణమని, తాము కూడా గతంలో ఇలాంటి చేదు అనుభవాలనే ఎదుర్కొన్నామని చాలామంది తమ బాధను పంచుకుంటున్నారు. మరికొందరు నెటిజన్లు సదరు కంపెనీపై లీగల్‌గా ముందుకు వెళ్లాలని దర్శనకు సలహా ఇస్తున్నారు.






