- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్టీరియస్ థ్రిల్లర్ ‘వదలా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదంటూ మేకర్స్ పోస్ట్
ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుని విడుదలకు సిద్ధమైంది.

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు జగపతి బాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మిస్టీరియస్ థ్రిల్లర్ ‘వదలా’. అకెళ్లవి. కృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని కిషోర్ నాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మిస్తున్నారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మిస్టీరియస్ థ్రిల్లర్‌ను జులై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో పాటు చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసిన క్యాప్షన్ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. "ఆప్యాయతతో నిండిన ఒక ఇల్లు, ఇప్పుడు ఒక శీతలమైన పరిస్థితిని ఎదుర్కోబోతోంది.. అది వచ్చిన రోజున, ఇక వెనక్కి మళ్ళే అవకాశం ఉండదు" అంటూ ఒక పవర్‌ఫుల్ అండ్ హర్రర్ టచ్‌తో కూడిన డైలాగ్‌ను పంచుకున్నారు. ఇది చూస్తుంటే ఒకప్పుడు ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబంలోకి, ఒక పాత ఇంట్లోకి ఎలాంటి ఊహించని శక్తి ప్రవేశించింది? దాని వల్ల ఆ కుటుంబం ఎలాంటి భయానక పరిస్థితులను ఎదుర్కొంది? అనే అంశాల చుట్టూ కథ సాగనున్నట్లు అర్థమవుతోంది. అయితే చాలా కాలం తర్వాత లయ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తుండటం విశేషం.






