చర్చకు పిలిచి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనం

by Ratna Kumari |

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును చర్చల పేరుతో పిలిపించి పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు.

చర్చకు పిలిచి అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనం
X

దిశ, గంగాధర : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావును చర్చల పేరుతో పిలిపించి పోలీసుల ద్వారా అక్రమంగా అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. గురువారం గంగాధరలో విలేకరులతో మాట్లాడుతూ.. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి బయటపడుతుందనే భయంతోనే కాంగ్రెస్ మంత్రులు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. చర్చకు రావాలని సవాల్ విసిరి, బీఆర్‌ఎస్ నాయకులు వచ్చిన తర్వాత పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయించడం సరికాదని అన్నారు. అవినీతికి పాల్పడలేదంటే మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర బీఆర్‌ఎస్ నాయకులను చర్చకు రానివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సవాల్ విసిరి వెనక్కి తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి, చేతకానితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల ముందు ఎండగట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు స్వయంగా కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసినా స్పందించకుండా, చర్చల నుంచి తప్పించుకున్నారని సుంకె రవిశంకర్ ఆరోపించారు. పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేయించడం ద్వారా అవినీతిని దాచలేరని అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ధైర్యంగా ముందుకు వచ్చి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని సుంకె రవిశంకర్ సవాల్ విసిరారు.

Next Story