మామ ఇంట్లోనే అల్లుడి చోరీ.. లక్షల విలువైన బంగారం రికవరీ

by Vemula.Srinu Prasad |

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వింత చోరీ వెలుగుచూసింది. తన సొంత మామ ఇంట్లోనే అల్లుడు చేతివాటం చూపించాడు..

మామ ఇంట్లోనే అల్లుడి చోరీ.. లక్షల విలువైన బంగారం రికవరీ
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వింత చోరీ వెలుగుచూసింది. తన సొంత మామ ఇంట్లోనే అల్లుడు చేతివాటం చూపించాడు. కుటుంబ సభ్యులు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. నల్లన్నగారి నాగరాజు వయసు 30 సంవత్సరాలు. వరుసకు మామ అయ్యే వ్యక్తి ఇంట్లోనే దొంగతనానికి ఒడిగట్టాడు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లిన నాగారాజు విలువైన వస్తువులు మాయం చేశారు. దీంతో బాధితులు వెంటనే మదనపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణలో నిజం ఒప్పుకున్న అల్లుడు

రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడు నాగరాజు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా చోరీ చేసింది తానేనని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 60 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, ఎలక్ట్రిక్ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం చేసిన సొత్తును రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. నిందితుడు నల్లన్నగారి నాగరాజు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story