- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురాతన రోడ్డు పనులకు మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు భూమి పూజ..
వందల సంవత్సరాల కిందట వైభవంగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న రోడ్డును తన సొంత నిధులతో దాదాపు కిలోమీటర్ మేర పునరుద్ధరణ పనులకు మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు భూమి పూజ చేశారు.

దిశ, మక్తల్: వందల సంవత్సరాల కిందట వైభవంగా రాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న రోడ్డును తన సొంత నిధులతో దాదాపు కిలోమీటర్ మేర పునరుద్ధరణ పనులకు శుక్రవారం మధ్యాహ్నం మంత్రి వాకిటి శ్రీహరి సోదరుడు వాకిటి శేషగిరి భూమి పూజ చేశారు. రాజుల సంస్థాన దీశుల కాలంలో హైదరాబాద్ నుండి కృష్ణానది ఆవల ఉన్న కర్ణాటక లోని రాయచూరుకు వెళ్లే రహదారి వైభవంగా ఉండేది 50 సంవత్సరాల కిందట మట్టిరోడుపై గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్న రోడ్డుకు ఇరుపక్కల రైతులు ఆక్రమించుకోవడంతో పిల్ల కాల్వలా మారింది. దీని బాగుచేసి పునరుద్ధరణ చేయాలని మంత్రి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లిగా.. ప్రజల సంక్షేమ ధ్యేయంగా పట్టణంలోని 4వ వార్డు నుండి కానాపురం కర్ని వైపు వెళ్లే రహదారితో బాటు కానాపురం కర్ని చెరువులకు నీటి ప్రవాహానికి సంబంధించిన సమస్యలు తీరుతాయని ప్రజల విజ్ఞప్తి మేరకు మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో మక్తల్ మాజీ ఉపసర్పంచ్ వాకిటి శేషగిరి సంబంధిత అధికార్లతో సమస్యలను పరిష్కరించాడు. సమస్యలు పరిష్కరించడంలో రాజకీయాలను పక్కన పెట్టి అఖిలపక్ష నాయకులందరం కలిసి పని చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.






