సంగంబండ కాలువ రహదారి కబ్జా..

by Kodari Anjali |

మాగనూర్ మండల కేంద్రంలోని సంగంబండ రిజర్వాయర్ ప్రధాన కాలువలకు ఇరువైపులా ఉన్న రహదారి ఆక్రమణలకు గురవుతోంది.

సంగంబండ కాలువ రహదారి కబ్జా..
X

దిశ, మాగనూర్: మండల కేంద్రంలోని సంగంబండ రిజర్వాయర్ ప్రధాన కాలువలకు ఇరువైపులా ఉన్న రహదారి ఆక్రమణలకు గురవుతోంది. సాగునీరు అందించే ఈ ప్రధాన కాలువల వెంట ఉన్న దారిని కొంతమంది రైతులు ఆక్రమించి సాగు చేసుకుంటుండటంతో, ఇతర రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆక్రమణలతో రాకపోకలు బంద్

కాలువ గట్ల వెంబడి ఉండాల్సిన రహదారిని పక్కనే ఉన్న పొలాల యజమానులు ఆక్రమించి సాగు భూమిగా మార్చుకున్నారు. దీనివల్ల ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు వెళ్లే దారి లేక రైతులు తమ వ్యవసాయ పనుల కోసం కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. పంట పండిన సమయంలో దిగుబడిని ఇంటికి చేర్చుకోవడం గగనంగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఈ సమస్యపై పలుమార్లు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణలను పరిశీలించినప్పటికీ, చర్యలు తీసుకోవడంలో మాత్రం "చూసీ చూడనట్లు" వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే కబ్జాదారులు రెచ్చిపోతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

Next Story