- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ ఎద అందాలపై అసభ్యకర కామెంట్.. కూల్‌గా రిప్లై ఇచ్చిన భర్త
నటీనటులు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకోవడం సర్వసాధారణం.

దిశ, వెబ్‌డెస్క్: నటీనటులు సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలను పంచుకోవడం సర్వసాధారణం. అయితే, కొందరు నెటిజన్లు నటీమణుల దుస్తులపై, వారి శరీర భాగాలపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తూ పరిధులు దాటుతుంటారు. తాజాగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ విషయంలోనూ ఇలాంటి ఘటనే ఎదురైంది. కానీ, ఈసారి ఆమె భర్త ఆండ్రీ కోస్చీవ్ సదరు నెటిజన్‌కు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. నటి శ్రియా శరన్ తరచూ తన భర్త ఆండ్రీతో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోలు, వీడియోలను, అలాగే గ్లామరస్ షూట్స్ విశేషాలను ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఆమె లైవ్ సెషన్ నిర్వహించినప్పుడు లేదా ఒక పోస్ట్ పెట్టినప్పుడు, ఓ ఆకతాయి నెటిజన్ అందాల ఉద్దేశిస్తూ అత్యంత అసభ్యకరంగా, నొప్పించేలా ఒక కామెంట్ చేశాడు.
భర్త ఆండ్రీ అదిరిపోయే కౌంటర్..
సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి కామెంట్లను చూసీచూడనట్లు వదిలేస్తారు లేదా డిలీట్ చేస్తారు. కానీ శ్రియా భర్త ఆండ్రీ కొస్చీవ్ మాత్రం ఆ కామెంట్ లైట్ తీసుకోలేదు. సదరు నెటీజన్ నోరు మూయించేలా అత్యంత వ్యంగ్యంగా, హుందాగా సమాధానమిచ్చాడు. “నువ్వు చెప్పింది నిజమే భయ్యా.. ఆమె అందాన్ని చూసి నేను కూడా మురిసిపోతున్నా. శ్రియా అందాలపై నీకున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నీలాంటి వాళ్లు మరిన్ని కామెంట్లు చేయాలని కోరుకుంటున్నా" అంటూ చాలా కూల్‌గా, అంతే పవర్ ఫుల్‌గా రిప్లై ఇచ్చాడు.
నెటిజన్ల ప్రశంసలు..
భార్య శరీరంపై ఒకరు అంత అసభ్యంగా కామెంట్ చేసినా.. ఆవేశపడకుండా, పద్ధతిగా తిప్పికొట్టిన ఆండ్రీ సమయస్ఫూర్తిని నెటిజన్లు అభినందిస్తున్నారు. "ఒక భర్తగా తన భార్యను ఇలాంటి నెగెటివిటీ నుంచి ఎలా కాపాడుకోవాలో ఆండ్రీ నిరూపించాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఆండ్రీ ఇచ్చిన ఈ రిప్లై సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.






