తోపుదుర్తి వర్సెస్ పరిటాల.. రాప్తాడులో మళ్లీ రగిలిన రాజకీయం

by Vemula.Srinu Prasad |

అనంతపురం జిల్లా రాప్తాడులో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.....

తోపుదుర్తి వర్సెస్ పరిటాల.. రాప్తాడులో మళ్లీ రగిలిన రాజకీయం
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా రాప్తాడులో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాలతో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కారును లారీతో ఢీ కొట్టి తనను చంపేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. దీంతో రాప్తాడు టీడీపీ వర్గీయులు భగ్గుమన్నారు. తోపుదుర్తి రాజకీయ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. హత్యకు కుట్ర అంటూ అబద్దాలు చెబుతున్నారంటూ సురేంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యారాజకీయాలు చేయడం చాలా దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.

తోపుదుర్తిపై పరిటాల శ్రీరామ్ ఫైర్

అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై ధర్మవరం టీడీపీ ఇంచార్జి పరిటాల శ్రీరామ్ ఫైర్ అయ్యారు. తోపుదుర్తి ప్రజా సమస్యలను వదిలేశారని ఆరోపించారు. హత్య రాజకీయాలు మొదలు పెట్టారని మండిపడ్డారు. నెల రోజులు గన్ మెన్లు లేకపోతే తోపుదుర్తి ఇంత టెన్షన్ పడుతున్నారంటూ విమర్శించారు. తోపుదుర్తి ఉత్తరకుమారుడని ఎద్దేవా చేశారు. యుద్ధం చేయడని, రథమూ తోలడని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల శ్రీరామ్ సెటైర్లు వేశారు.

Next Story