కేటీఆర్ 50వ పుట్టినరోజు.. గొప్ప నిర్ణయం

by Gantepaka Srikanth |

సమాజంలో చాలామంది తమ పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా, ఖర్చుతో కూడుకున్నవిగా జరుపుకుంటారు.

కేటీఆర్ 50వ పుట్టినరోజు.. గొప్ప నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: సమాజంలో చాలామంది తమ పుట్టినరోజు వేడుకలను ఆడంబరంగా, ఖర్చుతో కూడుకున్నవిగా జరుపుకుంటారు. కానీ, అందుకు భిన్నంగా తన 50వ పుట్టినరోజును పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. తన 50వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. ఈ ఏడాది నుంచి 50 మంది పేద విద్యార్థినుల చదువుకు సంబంధించిన పూర్తి బాధ్యతలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఒక స్వచ్ఛంద సంస్థ (NGO) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ చారిత్రాత్మకమైన, మానవతా దృక్పథంతో కూడిన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. "సమాజంలో అవసరంలో ఉన్నవారిని గుర్తించి, వారికి మనకు తోచిన విధంగా చేయూతనివ్వడమే నిజమైన మానవత్వం. నా 50వ పుట్టినరోజును కేవలం వేడుకగా కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను నా భుజాలపై వేసుకున్నాను అని పేర్కొన్నారు. విద్య ద్వారానే ఒక కుటుంబం, తద్వారా సమాజం ప్రగతి సాధిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

మహిళా సాధికారతకు పూర్తి భరోసా..

మహిళలు అన్నిరంగాల్లో రాణించినప్పుడే దేశం ముందుకు వెళ్తుందని, అందుకు విద్యే తొలి అడుగు అని వారు స్పష్టం చేశారు. "ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ఆడపిల్ల చదువుకు దూరం కాకూడదు. మహిళల సాధికారతకు, వారి స్వయంసమృద్ధికి నా వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుంది" అని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. తమ వంతు సాయంగా ఈ 50 మంది విద్యార్థినుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Next Story