మిస్సింగ్ కేసు ఛేదన.. తల్లీ పిల్లలు సురక్షితం

by Vemula.Srinu Prasad |

త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక మిస్సింగ్ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు...

మిస్సింగ్ కేసు ఛేదన.. తల్లీ పిల్లలు సురక్షితం
X

దిశ, ఎర్రగొండపాలెం: త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక మిస్సింగ్ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కనబడకుండా పోయిన మహిళ, ఆమె ఇద్దరు చిన్నారి పిల్లలను సురక్షితంగా గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

పోలీసుల కథనం ప్రకారం

యర్రగొండపాలెం మండలం గంగూపల్లి గ్రామానికి చెందిన దూదేకుల మీరవలి భార్య షేక్ షామీరా బీ (22) తన ఐదేళ్ల కుమార్తె దూదేకుల అయిష, రెండేళ్ల కుమారుడు దూదేకుల అయాన్‌లతో కలిసి ఇటీవల కనిపించకుండా పోయారు. దీనిపై త్రిపురాంతకం పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న త్రిపురాంతకం ఎస్సై, పోలీస్ సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక సమాచారం ఆధారంగా తల్లీపిల్లలు ముగ్గురినీ పోలీసులు సురక్షితంగా గుర్తించారు.

అనంతరం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, వారి బంధువులను పిలిపించి క్షేమంగా అప్పగించారు. తల్లీ, పిల్లలను వేగంగా గుర్తించి తమకు అప్పగించినందుకు బాధితుల బంధువులు త్రిపురాంతకం పోలీస్ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

Next Story