- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో ఢీ కొట్టి.. గుర్తు తెలియని పాదచారి మృతి
ఆటో ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది.

దిశ, అమీన్ పూర్: ఆటో ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం అర్ధరాత్రి బంధం కొమ్ము అమీన్ పూర్ గాంధీ చౌక్ చౌరస్తాలో రమావత్ అనిల్ అనే వ్యక్తి తన ఆటోను నిర్లక్ష్యంగా అతివేగంతో నడుపుకుంటూ వచ్చి గుర్తు తెలియని పాదచారిని ఢీ కొట్టాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని అనంతరం మృతదేహాన్ని పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మార్చూరిలో భద్రపరిచారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతదేహం గుర్తులు...
మృతి చెందిన వ్యక్తి 50 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడు. గులాబీ రంగు కలిగిన ఫుల్ షర్ట్ ధరించి ఉన్నాడు. నలుపు రంగు ప్యాంటు, ఎడమ చేతికి తెలుపు రంగు గడియారం ధరించి నలుపు తెలుపు రంగు గల గడ్డం తో ఉన్నాడు. సమాచారం కొరకు అమీన్ పూర్ పోలీసులను ఈ ఫోన్ 8712581445, 8712661842 నెంబర్లకు సంప్రదించాలి.






