దిశ ఎఫెక్ట్.. మున్సిపల్ అధికారుల తక్షణ చర్య

by Kodari Anjali |

దిశ కథనానికి మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు.

దిశ ఎఫెక్ట్.. మున్సిపల్ అధికారుల తక్షణ చర్య
X

దిశ, కోరుట్ల టౌన్: పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ వీధిలో డ్రైనేజీ పూడికతీత కారణంగా రోడ్డుపై మురుగు చెత్త చేరి, దుర్గంధంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని "డ్రైనేజీ పూడికతీతతో రోడ్డుపై మురుగు.. దుర్గంధంతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు" అనే శీర్షికతో దిశలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించారు. కథనం వెలువడిన వెంటనే సంబంధిత అధికారులు సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి రోడ్డుపై నిల్వ ఉన్న మురుగు చెత్తను పూర్తిగా తొలగించి, డ్రైనేజీ పరిసరాలను శుభ్రం చేయించారు. దీంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన దిశకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై మీడియా స్పందించి, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.

Next Story